![]() |
![]() |

ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం షో ఈవారం ఫుల్ ఎనర్జిటిక్ గా సాగింది. ఈ షోకి ఆది పినిశెట్టి, సందీప్ కిషన్ వచ్చారు. హోస్ట్ మంచు మనోజ్ వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్... ఇక ఈ షోలో ఈ ఇద్దరినీ ఆడియన్స్ కొన్ని ప్రశ్నలు వేశారు. "సందీప్ కిషన్ మీరు మైకేల్ మూవీలో ఒక డైలాగ్ చెప్పారు అమ్మాయి కోసం కాకపోతే ఎందుకూ ఈ లైఫ్ అని.. మరి అలాంటి ఎవరైనా అమ్మాయి మీ లైఫ్ లో ఉందా" అని అడిగాడు. "ఏ అమ్మాయి కోసమైతే నేను ప్రాణం ఇవ్వను..మీరు కూడా ఇవ్వకండి" అని సలహా ఇచ్చాడు. తర్వాత ఆది పినిశెట్టికి మరి అభిమాని ఒక ప్రశ్న అడిగాడు. "మీ వైఫ్ నిక్కీ గారి గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే" "నేను ఇంట్రావర్ట్ ని ఆమె చాలా బబ్లీగా, ఎనర్జిటిక్ గా ఉంటుంది." అని చెప్పాడు. ఇంతలో సందీప్ కిషన్ మాట్లాడుతూ పెళ్లి ముందే స్కాం చేసాడు ఆది.
ఎంగేజ్మెంట్ టైంలో వీడియో కాల్ చేసి నిక్కీ ఫోటోకి రెడ్ పెన్ తో బొట్టు పెట్టి పెళ్లయిపోయింది.. అనుకోని పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసరికి నాకు ఏడుపొచ్చేసింది. ఇటు చూస్తే ఆది బెస్ట్ ఫ్రెండ్ అటు చూస్తే నా చెల్లి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇలాంటి ప్రాంక్ వీడియోతో నన్ను భయపెట్టేసాడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే అంతే సంగతులు.." అన్నాడు .."ఇంట్లో అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని పెట్టుకుని ఫస్ట్ మూవీ ఏమిటి తేజా గారితో చేసావ్..ప్రొడక్షన్ దాసరి గారు " అని మంచు మనోజ్ ఆది పినిశెట్టిని అడిగాడు "ఇదంతా ప్లాన్ చేసి జరిగిన విషయం కాదు. ఒక వారం రోజుల్లో షూటింగ్ ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళు తోశారు కానీ నేను అప్పటికి ప్రిపేర్ అయ్యి లేను. ఇంజనీరింగ్ చేసి పైలట్ అవుదామని అనుకున్నా..కానీ యాక్టర్ ని కావాల్సి వచ్చింది" అని చెప్పాడు ఆది. ఆది పినిశెట్టి ఒక విచిత్రం అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సందీప్ కిషన్ ప్రస్థానం మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.
![]() |
![]() |